Home యెహెజ్కేలు 48:8 · తెలుగు బైబిల్

యెహెజ్కేలు

Chapter 48 · Verse 8

తెలుగు బైబిల్

యెహెజ్కేలు 48:8

యూదావారి సరిహద్దును అనుకొని తూర్పు పడమర లుగా మీరు ప్రతిష్టించు ప్రతిష్టిత భూమియుండును. దాని వెడల్పు ఇరువదియైదు వేల కొలకఱ్ఱలు; దాని నిడివి తూర్పునుండి పడమరవరకు తక్కినభాగముల నిడివి వలెనే యుండును; పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండవలెను.

Book: Ezekiel · Chapter: 48 · Verse: 8

Cross References

యెషయా 12:6

సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.

యెషయా 33:20

ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము నిమ్మళమైన కాపురముగాను తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూష లేమును చూచును దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటియైనను తెగదు.

యెహెజ్కేలు 45:1

మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును ఉండ వలెను, ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠిత మగును.

యెహెజ్కేలు 48:21

ప్రతిష్ఠితస్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని, అనగా తూర్పుదిశను ప్రతిష్ఠితస్థానముగా ఏర్పడిన యిరువది యయిదువేల కొలకఱ్ఱలును పడ మటి దిశను గోత్రస్థాన ములుగా ఏర్పడిన యిరువది యయిదు వేల కొలకఱ్ఱలును గల భూమిని యానుకొనుస్థానము అధిపతిదగును. ప్రతి ష్ఠిత స్థానమును, మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును.

యెహెజ్కేలు 48:35

దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.

జెకర్యా 2:11

ఆ దినమున అన్య జనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.

2 కొరింథీయులకు 6:16

దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.

ఎఫెసీయులకు 2:20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

కొలస్సీయులకు 2:9

ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;

ప్రకటన గ్రంథము 21:3

అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

ప్రకటన గ్రంథము 21:22

దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.

ప్రకటన గ్రంథము 22:3

ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme