Home యెహెజ్కేలు 40:3 · తెలుగు బైబిల్

యెహెజ్కేలు

Chapter 40 · Verse 3

తెలుగు బైబిల్

యెహెజ్కేలు 40:3

అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.

Book: Ezekiel · Chapter: 40 · Verse: 3

Cross References

యెషయా 8:20

ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచా రించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.

యెషయా 28:17

నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.

యెహెజ్కేలు 1:7

వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను.

యెహెజ్కేలు 1:27

చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను.

యెహెజ్కేలు 8:2

అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజియైనట్టుగాను ఆయన నాకు కనబడెను.

యెహెజ్కేలు 47:3

ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను.

దానియేలు 10:5

నేను కన్నులెత్తిచూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను.

జెకర్యా 2:1

మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టు కొనిన యొకడు నాకు కనబడెను.

ప్రకటన గ్రంథము 1:15

ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.

ప్రకటన గ్రంథము 11:1

మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చినీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.

ప్రకటన గ్రంథము 21:15

ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme