యెహెజ్కేలు 4:6
ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి యున్నాను.
యెహెజ్కేలు 4:6
ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి యున్నాను.
మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.
తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణము నకును డెబ్బదివారములు విధింపబడెను.
అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైనదానిని నిలువ బెట్టువరకు వెయ్యిన్ని రెండువందల తొంబది దినము లగును.
మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి.
ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.
అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడ కుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.
డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.