Home యెహెజ్కేలు 18:24 · తెలుగు బైబిల్

యెహెజ్కేలు

Chapter 18 · Verse 24

తెలుగు బైబిల్

యెహెజ్కేలు 18:24

అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును.

Book: Ezekiel · Chapter: 18 · Verse: 24

Cross References

1 సమూయేలు 15:11

సౌలు నన్ను అనుసరింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడు చున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను.

2 దినవృత్తాంతములు 24:2

యాజకుడైన యెహోయాదా బ్రదికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.

2 దినవృత్తాంతములు 24:17

యెహోయాదాచని పోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను.

కీర్తనలు 36:3

వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసి యున్నాడు.

కీర్తనలు 125:5

తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని పాపముచేయువారితో కూడ యెహోవాకొనిపోవును ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.

సామెతలు 14:32

అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.

సామెతలు 21:16

వివేకమార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును.

యెహెజ్కేలు 3:20

మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని యెడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండ అతడు తన దోషమునుబట్టి మరణ మవును, అయితే అతని ప్రాణవిషయములో నిన్ను ఉత్తర వాదిగా ఎంచుదును.

యెహెజ్కేలు 18:10

అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి

యెహెజ్కేలు 18:18

అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారముచేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమునుబట్టి మరణము నొందును.

యెహెజ్కేలు 18:22

అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.

యెహెజ్కేలు 18:26

నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణము నొందును; తాను పాపము చేయుటనుబట్టియే గదా అతడు మరణమునొందును?

యెహెజ్కేలు 20:27

కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ పితరులు నాయెడల అతిక్రమముచేసి నన్ను దూషించి

యెహెజ్కేలు 33:12

మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము నీతిమంతుడు పాపము చేసిన దినమున అదివరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడు తనమునుబట్టి వాడు పడిపోడు, ఆలాగుననే నీతిమంతుడు పాపముచేసిన దినమున తన నీతినిబట్టి అతడు బ్రదుక జాలడు.

యెహెజ్కేలు 33:18

నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపము చేసిన యెడల ఆ పాపమునుబట్టి అతడు మరణము నొందును.

జెఫన్యా 1:6

యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme