Home యెహెజ్కేలు 12:18 · తెలుగు బైబిల్

యెహెజ్కేలు

Chapter 12 · Verse 18

తెలుగు బైబిల్

యెహెజ్కేలు 12:18

నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లుత్రాగి

Book: Ezekiel · Chapter: 12 · Verse: 18

Cross References

లేవీయకాండము 26:26

నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పునమీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు.

లేవీయకాండము 26:36

మీలో మిగిలినవారు తమ శత్రు వుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.

ద్వితీయోపదేశకాండము 28:48

గనుక ఆకలి దప్పులతోను వస్త్ర హీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.

ద్వితీయోపదేశకాండము 28:65

ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును.

యోబు 3:24

భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.

కీర్తనలు 60:2

నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని బద్దలు చేసియున్నావు అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము.

కీర్తనలు 80:5

కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు చున్నావు.

కీర్తనలు 102:4

ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.

విలాపవాక్యములు 5:9

ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.

యెహెజ్కేలు 4:10

నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళవేళకు తినవలెను,

యెహెజ్కేలు 4:16

నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు.

యెహెజ్కేలు 23:33

నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలో నిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme