యెహెజ్కేలు 12:14
మరియు వారికి సహాయులై వచ్చినవారినందరిని అతని దండు వారినందరిని నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను
యెహెజ్కేలు 12:14
మరియు వారికి సహాయులై వచ్చినవారినందరిని అతని దండు వారినందరిని నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను
జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.
కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.
మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టు కొనును; మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలిసికొనును, అక్కడనే మీరు చత్తురు,
కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను చత్తురని నిశ్చయముగా తెలిసికొనుడి.
పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును.
కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును.
కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును.
నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చిన యెడల
ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేము మీద తీర్పుతీర్చినయెడల అట్టి వారుండినను వారు దాని రక్షింపలేరు
మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలిసికొనునట్లు అతని దండువారిలో తప్పించుకొని పారి పోయినవారందరును ఖడ్గముచేత కూలుదురు, శేషించిన వారు నలుదిక్కుల చెదరిపోవుదురు.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.