Home నిర్గమకాండము 9:24 · తెలుగు బైబిల్

నిర్గమకాండము

Chapter 9 · Verse 24

తెలుగు బైబిల్

నిర్గమకాండము 9:24

ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు.

Book: Exodus · Chapter: 9 · Verse: 24

Cross References

నిర్గమకాండము 9:23

మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.

నిర్గమకాండము 10:6

మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుట నుండి బయలు వెళ్లెను.

యోబు 38:23

ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?

కీర్తనలు 18:13

యెహోవా ఆకాశమందు గర్జనచేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను.

కీర్తనలు 105:32

ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించెను. వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను.

యెషయా 30:30

యెహోవా తన ప్రభావముగల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును.

యెహెజ్కేలు 1:4

నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చుచుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతిదానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటి దొకటి కనబడెను.

మత్తయి 24:21

లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme