Home నిర్గమకాండము 6:16 · తెలుగు బైబిల్

నిర్గమకాండము

Chapter 6 · Verse 16

తెలుగు బైబిల్

నిర్గమకాండము 6:16

లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

Book: Exodus · Chapter: 6 · Verse: 16

Cross References

ఆదికాండము 35:28

ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు.

ఆదికాండము 46:9

యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ.

ఆదికాండము 46:11

లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి

ఆదికాండము 47:28

యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు.

ఆదికాండము 50:26

యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.

నిర్గమకాండము 6:18

కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

నిర్గమకాండము 6:20

అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

సంఖ్యాకాండము 3:17

లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.

సంఖ్యాకాండము 3:18

గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.

సంఖ్యాకాండము 3:19

కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.

సంఖ్యాకాండము 3:20

మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.

సంఖ్యాకాండము 3:21

లిబ్నీ యులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే.

సంఖ్యాకాండము 16:1

లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీ యాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని

సంఖ్యాకాండము 26:57

వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు.

యెహోషువ 21:4

వంతుచీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్ష ముగా యూదా గోత్రికులనుండియు, షిమ్యోను గోత్రి కులనుండియు, బెన్యామీను గోత్రికులనుండియు చీట్లవలన వచ్చినవి పదమూడు పట్టణములు.

యెహోషువ 21:6

ఇశ్శాఖారు గోత్రికులనుండియు, ఆషేరు గోత్రికుల నుండియు, నఫ్తాలి గోత్రికులనుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపువారినుండియు చీట్లవలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme