Home నిర్గమకాండము 37:5 · తెలుగు బైబిల్

నిర్గమకాండము

Chapter 37 · Verse 5

తెలుగు బైబిల్

నిర్గమకాండము 37:5

మందసమును మోయుటకు దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను.

Book: Exodus · Chapter: 37 · Verse: 5

Cross References

సంఖ్యాకాండము 1:50

నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణము లన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయు లను నియమింపుము. వారే మందిర మును దాని ఉపకర ణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసిన వారై యుందురు.

సంఖ్యాకాండము 4:15

దండు ప్రయాణమైనప్పుడు అహరో నును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్ని టిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధ మైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము.

2 సమూయేలు 6:3

వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబుయొక్క యింటిలోనుండి తీసికొనిరాగా అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme