Home నిర్గమకాండము 32:16 · తెలుగు బైబిల్

నిర్గమకాండము

Chapter 32 · Verse 16

తెలుగు బైబిల్

నిర్గమకాండము 32:16

ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత.

Book: Exodus · Chapter: 32 · Verse: 16

Cross References

నిర్గమకాండము 31:18

మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.

నిర్గమకాండము 34:1

మరియు యెహోవా మోషేతోమొదటి పలకల వంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను.

నిర్గమకాండము 34:4

కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా

ద్వితీయోపదేశకాండము 9:9

ఆ రాతిపలకలు, అనగా యెహోవా మీతో చేసిన నిబంధనసంబంధ మైన పలకలను తీసికొను టకు నేను కొండెక్కినప్పుడు, అన్నపానములు మాని ఆ కొండమీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని.

ద్వితీయోపదేశకాండము 9:15

నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్నిచేత కాలుచుండెను, ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను.

ద్వితీయోపదేశకాండము 10:1

ఆ కాలమందు యెహోవామునుపటి వాటి వంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండ యెక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను.

యోబు 19:24

అవి యినుప పోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను.

2 కొరింథీయులకు 3:3

రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.

2 కొరింథీయులకు 3:7

మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహి మతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.

హెబ్రీయులకు 8:10

ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme