నిర్గమకాండము 29:36ప్రాయశ్చి త్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను.
లేవీయకాండము 4:7అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి నున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ములమీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను.
లేవీయకాండము 4:18మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి నున్న బలిపీఠపు కొమ్ములమీద చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.
లేవీయకాండము 16:5మరియు అతడు ఇశ్రాయేలీయుల సమా జము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను.
లేవీయకాండము 16:18మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము నొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడెరక్తములో కొంచెమును ఆ మేకరక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ములమీద చమిరి
లేవీయకాండము 16:29ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను.
లేవీయకాండము 23:27ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘ ముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.
హెబ్రీయులకు 1:3ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
హెబ్రీయులకు 9:7సంవత్సరమునకు ఒక్క సారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తముచేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.
హెబ్రీయులకు 9:22మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
హెబ్రీయులకు 9:25అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు.