Home నిర్గమకాండము 3:10 · తెలుగు బైబిల్

నిర్గమకాండము

Chapter 3 · Verse 10

తెలుగు బైబిల్

నిర్గమకాండము 3:10

కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.

Book: Exodus · Chapter: 3 · Verse: 10

Cross References

న్యాయాధిపతులు 6:14

అంతట యెహోవా అతనితట్టు తిరిగిబలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం పుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా

1 సమూయేలు 12:6

మరియు సమూయేలు జనులతో ఇట్లనెనుమోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తుదేశములోనుండి రప్పించినవాడు యెహోవాయే గదా

కీర్తనలు 77:20

మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.

కీర్తనలు 103:6

యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును

కీర్తనలు 105:26

ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను.

యెషయా 63:11

అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జను లను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?

హోషేయ 12:13

ఒక ప్రవక్తద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తుదేశములోనుండి రప్పించెను, ప్రవక్తద్వారా వారిని కాపాడెను.

మీకా 6:4

ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.

అపొస్తలుల కార్యములు 7:34

ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చి యున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను.

అపొస్తలుల కార్యములు 7:36

ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme