Home నిర్గమకాండము 17:3 · తెలుగు బైబిల్

నిర్గమకాండము

Chapter 17 · Verse 3

తెలుగు బైబిల్

నిర్గమకాండము 17:3

అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషే మీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి.

Book: Exodus · Chapter: 17 · Verse: 3

Cross References

నిర్గమకాండము 14:11

అంతట వారు మోషేతో - ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల?

నిర్గమకాండము 15:24

ప్రజలు - మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా

నిర్గమకాండము 16:2

ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను.

నిర్గమకాండము 16:3

ఇశ్రాయేలీయులు - మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతివిు? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా

నెహెమ్యా 9:15

వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణముచేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారి కాజ్ఞాపించితివి.

నెహెమ్యా 9:20

వారికి భోధించుటకు నీ యుపకారాత్మను దయ చేసితివి, నీ విచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు; వారి దాహమునకు ఉదకమిచ్చితివి.

కీర్తనలు 107:5

ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme