Home ప్రసంగి 10:14 · తెలుగు బైబిల్

ప్రసంగి

Chapter 10 · Verse 14

తెలుగు బైబిల్

ప్రసంగి 10:14

కలుగబోవునది ఏదో మను ష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు; నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో యెవరు తెలియజేతురు?

Book: Ecclesiastes · Chapter: 10 · Verse: 14

Cross References

యోబు 34:37

అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు కొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.

యోబు 35:16

నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.

సామెతలు 10:19

విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.

సామెతలు 15:2

జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలు కును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.

ప్రసంగి 3:22

కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము.

ప్రసంగి 5:3

విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును.

ప్రసంగి 6:12

నీడవలె తమ దినములన్నియు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రదుకునందు ఏది వారికి క్షేమకరమైనదొ యెవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు?

ప్రసంగి 8:7

సంభవింప బోవునది నరులకు తెలియదు; అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయువారెవరు?

యెహెజ్కేలు 35:13

పెద్దనోరు చేసికొని మీరు నామీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను.

యాకోబు 4:13

నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme