Home ద్వితీయోపదేశకాండము 9:24 · తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము

Chapter 9 · Verse 24

తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము 9:24

నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచున్నారు.

Book: Deuteronomy · Chapter: 9 · Verse: 24

Cross References

సంఖ్యాకాండము 32:14

ఇప్పుడు ఇశ్రాయేలీయులయెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతాన మైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి యున్నారు.

ద్వితీయోపదేశకాండము 9:6

మీరు లోబడ నొల్లనివారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచు కొనునట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతినిబట్టి నీకియ్యడని నీవు తెలిసికొనవలెను.

ద్వితీయోపదేశకాండము 31:27

నీ తిరుగుబాటును నీ మూర్ఖ త్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి.

యెషయా 48:8

అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పించుకొంటివని నాకు తెలియును.

యిర్మియా 4:17

ఆమె నామీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేనికాపరులవలె దానిచుట్టు ముట్టడివేతురు; ఇదే యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 20:8

అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మాన లేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని.

అపొస్తలుల కార్యములు 7:51

ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme