ద్వితీయోపదేశకాండము 6:11
నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింప బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావు లను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీ కిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు
ద్వితీయోపదేశకాండము 6:11
నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింప బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావు లను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీ కిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు
మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచు కొనినయెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణముచేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును
నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను.
నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని
నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో.
కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొన వలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.
మరియు నీవు తిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను.
యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.
మీరు కట్టని పట్టణములను మీకిచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లను ఒలీవతోటల పండ్లను తినుచున్నారు.
అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి.
అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణ ములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని, సకలమైన పదార్థములతో నిండియున్న యిండ్లను త్రవ్విన బావులను ద్రాక్షతోటలను ఒలీవ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. ఆలాగున వారు తిని తృప్తిపొంది మదించి నీ మహోపకారమునుబట్టి బహుగా సంతోషించిరి.
వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.
ఈ తరమువార లారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడినేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?
విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని.
యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.