Home ద్వితీయోపదేశకాండము 32:8 · తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము

Chapter 32 · Verse 8

తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము 32:8

మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.

Book: Deuteronomy · Chapter: 32 · Verse: 8

Cross References

ఆదికాండము 10:5

వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆయా దేశములలో వారు వేరైపోయిరి.

ఆదికాండము 10:15

కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను

ఆదికాండము 10:25

ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.

ఆదికాండము 11:8

ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుటమానిరి.

ఆదికాండము 15:18

ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా

సంఖ్యాకాండము 24:16

దేవవాక్కులను వినిన వాని వార్త మహాన్నతుని విద్య నెరిగినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.

1 దినవృత్తాంతములు 16:18

వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెల విచ్చెను.

యోబు 15:19

అన్యులతో సహవాసము చేయకతాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించినజ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.

కీర్తనలు 7:17

యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.

కీర్తనలు 50:14

దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

కీర్తనలు 82:6

మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల విచ్చియున్నాను.

కీర్తనలు 91:1

మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.

కీర్తనలు 92:8

యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు

కీర్తనలు 115:16

ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.

యెషయా 14:14

మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

దానియేలు 4:17

ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయ మైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరు గును.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme