ద్వితీయోపదేశకాండము 11:16మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్త పడుడి.
ద్వితీయోపదేశకాండము 17:2నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధ ముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రుని కైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడేగాని స్త్రీయేగాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియం దైనను నీ మధ్య కనబడినప్పుడు
కీర్తనలు 10:13దుష్టులు దేవుని తృణీకరించుట యేల? నీవు విచారణ చేయౌవని వారు తమ హృదయములలో అను కొనుటయేల?
యిర్మియా 9:15సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును.
యిర్మియా 23:17వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.
హోషేయ 10:4అబద్ధప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టిమాటలు పలుకుదురు, అందువలన భూమి చాళ్లలో విషపుకూర మొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలు దేరు చున్నవి.
ఆమోసు 6:12గుఱ్ఱములు బండలమీద పరుగెత్తునా? అట్టిచోట ఎవరైన ఎద్దులతో దున్నుదురా? అయినను మాశక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానినిబట్టి సంతోషించు మీరు,
హెబ్రీయులకు 3:12సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.
హెబ్రీయులకు 12:15మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,