ద్వితీయోపదేశకాండము 27:3
నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మ శాస్త్రవాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.
ద్వితీయోపదేశకాండము 27:3
నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మ శాస్త్రవాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.
నేను మీతో చెప్పిన మాట యిదేమీరు వారి భూమిని స్వాస్థ్య ముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవ హించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపర చిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి.
యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును;. అది పాలు తేనెలు ప్రవహించుదేశము.
కాబట్టి ఇశ్రాయేలూ, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను.
అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.
యీ స్థలమునకు మనలను చేర్చి, పాలు తేనెలు ప్రవహించు దేశమైయున్న యీ దేశమును మనకిచ్చెను.
యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమా ణముచేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి యుండెను గనుక ఐగుప్తులోనుండి వచ్చిన ఆ యోధు లందరు యెహోవా మాట వినకపోయినందున వారు నశించువరకు ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి.
మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.
అందుకు యెహోవా, ఆ ప్రకారము జరుగును గాకని నేనంటిని.
ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.
మీ కిచ్చెదనని వారి పితరులకు ప్రమాణముచేసి, పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారి కిచ్చితివి.
మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?
ఈయన యైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు.
ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.