Home ద్వితీయోపదేశకాండము 26:5 · తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము

Chapter 26 · Verse 5

తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము 26:5

నీవునా తండ్రి నశించుచున్న అరామీదేశస్థుడు; అతడు ఐగుప్తు నకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను.

Book: Deuteronomy · Chapter: 26 · Verse: 5

Cross References

ఆదికాండము 24:4

నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.

ఆదికాండము 25:20

ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.

ఆదికాండము 27:41

తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.

ఆదికాండము 28:5

అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.

ఆదికాండము 31:20

యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చినవాడాయెను.

ఆదికాండము 31:24

ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చినీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.

ఆదికాండము 31:40

పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను.

ఆదికాండము 43:1

ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక

ఆదికాండము 43:12

రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేత పట్టు కొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును;

ఆదికాండము 45:7

ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

ఆదికాండము 45:11

ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.

ఆదికాండము 46:1

అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను.

ఆదికాండము 46:3

ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్పజనముగా చేసెదను.

ఆదికాండము 46:6

వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి.

ఆదికాండము 46:7

అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను.

ఆదికాండము 46:27

ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme