లేవీయకాండము 14:34నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల
ద్వితీయోపదేశకాండము 7:1నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత
ద్వితీయోపదేశకాండము 11:31మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమును స్వాధీన పరచుకొనుటకు ఈ యొర్దానును దాటబోవుచున్నారు. మీరు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు.
ద్వితీయోపదేశకాండము 18:9నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.
ద్వితీయోపదేశకాండము 26:1నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చు చున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు
యెహోషువ 1:13యెహోవా సేవకుడైన మోషే మీ కాజ్ఞా పించిన సంగతి జ్ఞాపకము చేసికొనుడి, ఎట్లనగా మీ దేవు డైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు; ఆయన ఈ దేశమును మీకిచ్చును.
1 సమూయేలు 8:5చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.
1 సమూయేలు 8:19అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లకఆలాగున కాదు,
1 సమూయేలు 10:25తరువాత సమూయేలు రాజ్యపాలనపద్ధతిని జనులకు వినిపించి, ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను.
1 సమూయేలు 12:19సమూయేలుతో ఇట్లనిరిరాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితివిు. కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము.