Home ద్వితీయోపదేశకాండము 14:29 · తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము

Chapter 14 · Verse 29

తెలుగు బైబిల్

ద్వితీయోపదేశకాండము 14:29

అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్య మైనను లేని లేవీ యులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనముచేసి తృప్తిపొందుదురు.

Book: Deuteronomy · Chapter: 14 · Verse: 29

Cross References

నిర్గమకాండము 22:21

పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశ ములో పరదేశులై యుంటిరి గదా.

లేవీయకాండము 19:34

మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింప వలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.

ద్వితీయోపదేశకాండము 10:9

కాబట్టి తమ సహో దరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొంద లేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము.

ద్వితీయోపదేశకాండము 12:12

మీరు, మీ కుమా రులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ యిండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.

ద్వితీయోపదేశకాండము 14:27

లేవీ యులను విడువ కూడదు; నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు.

ద్వితీయోపదేశకాండము 15:10

నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును.

ద్వితీయోపదేశకాండము 16:11

అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవ రాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.

ద్వితీయోపదేశకాండము 16:14

ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశు లును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతో షింపవలెను.

ద్వితీయోపదేశకాండము 23:21

నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరు వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయ కూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.

ద్వితీయోపదేశకాండము 24:19

నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొల ములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొను టకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండ వలెను.

ద్వితీయోపదేశకాండము 26:12

పదియవ భాగమిచ్చు సంవత్సరమున, అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదియవ వంతును చెల్లించి, అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేనివారికిని విధవ రాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తిపొందినతరు వాత

ద్వితీయోపదేశకాండము 28:8

నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.

యోబు 31:16

బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను

కీర్తనలు 41:1

బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.

కీర్తనలు 41:2

యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు.

సామెతలు 3:9

నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme