ద్వితీయోపదేశకాండము 11:7
యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా.
ద్వితీయోపదేశకాండము 11:7
యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా.
బయల్పెయోరు విషయ ములో యెహోవా చేసినదానిని మీరు కన్నులార చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండ నాశనము చేసెను.
యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.
నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును, చాచిన చేతిని బాగుగ జ్ఞాపకము చేసికొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును.
నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవు డైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను.
మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెనుయెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనము నకును చేసినదంతయు, అనగా
యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీ యులు యెహోవాను సేవించుచు వచ్చిరి.
యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు?
ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు
నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు
ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.