ద్వితీయోపదేశకాండము 1:42
యెహోవా నాతో ఇట్లనెనుయుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండను గనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము.
ద్వితీయోపదేశకాండము 1:42
యెహోవా నాతో ఇట్లనెనుయుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండను గనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము.
నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.
అప్పుడు మోషేఇది ఏల? మీరు యెహోవా మాట మీరు చున్నారేమి?
ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీ యులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను?
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులమీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే యెక్కువతక్కువ నాలుగు వేలమంది హతులైరి.
ఫిలిష్తీయులు యుద్దముచేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను.
మీరు పర్వతముమీదనుండు కొయ్యవలెను కొండమీదనుండు జెండావలెను అగువరకు ఒకని గద్దింపునకు మీలో వెయ్యిమంది పారిపోయెదరు అయిదుగురి గద్దింపునకు మీరు పారిపోయెదరు.
రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను
వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.