ద్వితీయోపదేశకాండము 7:6నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.
ద్వితీయోపదేశకాండము 26:19తాను సృజించిన సమస్త జనముల కంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిం చుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహో వాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను.
ద్వితీయోపదేశకాండము 32:40నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనినయెడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను
యోబు 27:2నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు
యెషయా 62:12పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార నియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.
యిర్మియా 4:2సత్యమునుబట్టియు న్యాయమును బట్టియు నీతినిబట్టియు యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయనయందే అతిశయపడుదురు.
దానియేలు 4:31రాజు నోట ఈ మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను.
దానియేలు 4:34ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నె జరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి.
దానియేలు 7:21ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయెను.
దానియేలు 7:25ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.
దానియేలు 8:14అందుకతడు రెండువేల మూడువందల దినములమట్టుకే యని నాతో చెప్పెను. అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చ బడును.
దానియేలు 8:24అతడు గెలుచునుగాని తన స్వబలమువలన గెలువడు; ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను, అనగా పరిశుద్ధ జనమును నశింప జేయును.
దానియేలు 11:13ఏలయనగా ఉత్తర దేశపురాజు మొదటి సైన్యముకంటె ఇంక గొప్ప సైన్యమును సమ కూర్చుకొని మరల వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును.
దానియేలు 12:6ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటినీళ్లపైన ఆడుచుండువాని చూచి ఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా
దానియేలు 12:11అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైనదానిని నిలువ బెట్టువరకు వెయ్యిన్ని రెండువందల తొంబది దినము లగును.