Home దానియేలు 10:2 · తెలుగు బైబిల్

దానియేలు

Chapter 10 · Verse 2

తెలుగు బైబిల్

దానియేలు 10:2

ఆ దినముల యందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని.

Book: Daniel · Chapter: 10 · Verse: 2

Cross References

ఎజ్రా 9:4

చెరపట్ట బడినవారి అపరాధమును చూచి, ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నాయొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళవరకు కూర్చుంటిని.

నెహెమ్యా 1:4

ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.

కీర్తనలు 42:9

కావుననీవేల నన్ను మరచి యున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.

కీర్తనలు 43:2

నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల?

కీర్తనలు 137:1

బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి.

యెషయా 66:10

యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి

యిర్మియా 9:1

నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.

దానియేలు 9:24

తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణము నకును డెబ్బదివారములు విధింపబడెను.

మత్తయి 9:15

యేసుపెండ్లి కుమారుడు తమతోకూడ నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉప వాసము చేతురు.

రోమీయులకు 9:2

క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు.

యాకోబు 4:9

వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

ప్రకటన గ్రంథము 11:5

ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme