Home ఆమోసు 6:10 · తెలుగు బైబిల్

ఆమోసు

Chapter 6 · Verse 10

తెలుగు బైబిల్

ఆమోసు 6:10

ఒకని దాయాది కాల్చబోవు వానితోకూడ ఎముకలను ఇంటిలోనుండి బయటికి కొనిపోవుటకై శవ మును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకనిచూచి యింటిలో మరి ఎవరైన మిగిలియున్నారా? యని అడుగగా అతడుఇంకెవరును లేరనును; అంతట దాయా దిట్లనునునీవిక నేమియు పలుకక ఊరకుండుము, యెహోవానామము స్మరించకూడదు;

Book: Amos · Chapter: 6 · Verse: 10

Cross References

సంఖ్యాకాండము 17:12

అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరిఇదిగో మా ప్రాణములు పోయినవి; నశించిపోతివిు మేమందరము నశించిపోతివిు.

1 సమూయేలు 31:12

బలశాలులందరు లేచి రాత్రి యంత నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళే బరములను బేత్షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనముచేసి

2 రాజులు 6:33

ఆ దూత అతనియొద్దకు వచ్చెను. అంతట రాజుఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవాకొరకు కనిపెట్టి యుండవలెననెను.

2 రాజులు 23:16

యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను.

యిర్మియా 16:6

ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొన కుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు.

యిర్మియా 44:26

కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవామాటవినుడియెహోవా సెలవిచ్చునదేమనగా ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణము చేయుచు, ఐగుప్తులో నివసించు యూదు లలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయు చున్నాను.

యెహెజ్కేలు 20:39

ఇశ్రాయేలు యింటివార లారా, మీరు నామాట వినని యెడల మీరు పెట్టుకొనిన విగ్రహములను, మీ కిష్టమైనట్టుగా పూజించుకొనుడి, గాని మీ అర్పణలచేతను మీ విగ్రహములచేతను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెహెజ్కేలు 24:21

ఇశ్రాయేలీయులకు నీవీలాగున ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చట గాను, మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులును కుమార్తెలును అక్కడనే ఖడ్గముచేత కూలుదురు.

ఆమోసు 5:13

ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.

ఆమోసు 8:3

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కు వగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme