Home ఆమోసు 3:8 · తెలుగు బైబిల్

ఆమోసు

Chapter 3 · Verse 8

తెలుగు బైబిల్

ఆమోసు 3:8

సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువా డెవడు?

Book: Amos · Chapter: 3 · Verse: 8

Cross References

యోబు 32:18

నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది.

యోబు 32:19

నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది.

యెషయా 21:10

నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చ బడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను.

యిర్మియా 20:9

ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.

యిర్మియా 26:12

అప్పుడు యిర్మీయా అధిపతులందరితోను జనులందరితోను ఈ మాట చెప్పెనుఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు.

ఆమోసు 1:2

అతడు ప్రకటించినదేమనగా యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండి పోవుచున్నది.

ఆమోసు 2:12

అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.

ఆమోసు 3:4

ఏమియు పట్టు కొనకుండనే కొదమ సింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా?

ఆమోసు 7:12

మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదాదేశమునకు పారి పొమ్ము; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము;

ఆమోసు 7:14

అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను.

ఆమోసు 7:15

నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచినీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెల విచ్చెను.

యోనా 1:1

యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

యోనా 3:1

అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

అపొస్తలుల కార్యములు 4:20

మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;

అపొస్తలుల కార్యములు 5:20

ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను.

అపొస్తలుల కార్యములు 5:29

అందుకు పేతురును అపొస్తలులునుమనుష్యలకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme