Home అపొస్తలుల కార్యములు 26:17 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 26 · Verse 17

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 26:17

నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;

Book: Acts · Chapter: 26 · Verse: 17

Cross References

1 దినవృత్తాంతములు 16:35

దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము.

కీర్తనలు 34:19

నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.

కీర్తనలు 37:32

భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.

యిర్మియా 1:8

వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 1:19

వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.

అపొస్తలుల కార్యములు 9:15

అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు

అపొస్తలుల కార్యములు 9:23

అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా

అపొస్తలుల కార్యములు 9:29

ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను.

అపొస్తలుల కార్యములు 13:50

గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.

అపొస్తలుల కార్యములు 14:5

మరియు అన్యజనులును యూదులును తమ అధికారులతో కలిసి వారిమీద పడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలెనని యుండిరి.

అపొస్తలుల కార్యములు 14:19

అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి.

అపొస్తలుల కార్యములు 16:39

వారిని బతిమాలుకొని వెలుపలికి తీసికొనిపోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి.

అపొస్తలుల కార్యములు 17:10

వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి.

అపొస్తలుల కార్యములు 17:14

వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.

అపొస్తలుల కార్యములు 18:10

నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా

అపొస్తలుల కార్యములు 18:12

గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme