Home అపొస్తలుల కార్యములు 14:2 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 14 · Verse 2

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 14:2

అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి.

Book: Acts · Chapter: 14 · Verse: 2

Cross References

మార్కు 15:10

పిలాతు తెలిసికొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను.

యోహాను 3:36

కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

అపొస్తలుల కార్యములు 13:45

యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.

అపొస్తలుల కార్యములు 13:50

గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.

అపొస్తలుల కార్యములు 14:19

అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి.

అపొస్తలుల కార్యములు 17:5

అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టు కొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.

అపొస్తలుల కార్యములు 17:13

అయితే బెరయలోకూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.

అపొస్తలుల కార్యములు 18:12

గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి

అపొస్తలుల కార్యములు 21:27

ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని

1 థెస్సలొనీకయులకు 2:15

ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme