Home అపొస్తలుల కార్యములు 13:28 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 13 · Verse 28

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 13:28

ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించ వలెనని వారు పిలాతును వేడుకొనిరి.

Book: Acts · Chapter: 13 · Verse: 28

Cross References

మత్తయి 27:19

అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య - నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయ ననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను.

మత్తయి 27:22

అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి.

మార్కు 15:13

వారువానిని సిలువవేయుమని మరల కేకలువేసిరి.

లూకా 23:4

పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోను ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను.

లూకా 23:14

ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ లేదు;

లూకా 23:21

వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి.

యోహాను 18:38

అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;

యోహాను 19:4

పిలాతు మరల వెలుపలికి వచ్చిఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.

యోహాను 19:12

ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులునీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.

అపొస్తలుల కార్యములు 3:13

అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme