Home అపొస్తలుల కార్యములు 1:19 · తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు

Chapter 1 · Verse 19

తెలుగు బైబిల్

అపొస్తలుల కార్యములు 1:19

ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా

Book: Acts · Chapter: 1 · Verse: 19

Cross References

2 సమూయేలు 2:16

ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.

మత్తయి 28:15

అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది.

అపొస్తలుల కార్యములు 2:22

ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందిన వానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.

అపొస్తలుల కార్యములు 21:40

అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్చబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme