Home 2 సమూయేలు 8:14 · తెలుగు బైబిల్

2 సమూయేలు

Chapter 8 · Verse 14

తెలుగు బైబిల్

2 సమూయేలు 8:14

మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీ యులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.

Book: 2 Samuel · Chapter: 8 · Verse: 14

Cross References

ఆదికాండము 25:23

రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

ఆదికాండము 27:29

జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధు జనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక

ఆదికాండము 27:37

అందుకు ఇస్సాకు - ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయవలెనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా¸

సంఖ్యాకాండము 24:17

ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.

సంఖ్యాకాండము 24:18

ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇశ్రాయేలు పరాక్రమమొందును.

2 సమూయేలు 5:10

దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను.

2 సమూయేలు 7:9

నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకము లోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను.

2 సమూయేలు 8:6

దమస్కువశముననున్న సిరియదేశమందు దండును ఉంచగా, సిరియనులు దావీదు నకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.

1 రాజులు 11:15

దావీదు ఎదోము దేశముమీద యుద్ధము చేయుచుండగా, సైన్యాధిపతియైన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లి యున్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరిని హతము చేసెను.

1 రాజులు 22:47

ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనము చేయుచుండెను.

1 రాజులు 22:48

యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను.

2 రాజులు 14:7

మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు.

2 రాజులు 18:7

కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను; తాను వెళ్లిన చోట నెల్ల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవచేయకుండ అతనిమీద తిరుగబడెను.

1 దినవృత్తాంతములు 18:13

దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకు లైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను.

కీర్తనలు 60:1

దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టి యున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.

కీర్తనలు 60:8

మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వనిచేయుము.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme