Home 2 సమూయేలు 5:17 · తెలుగు బైబిల్

2 సమూయేలు

Chapter 5 · Verse 17

తెలుగు బైబిల్

2 సమూయేలు 5:17

జనులు ఇశ్రాయేలీయులమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరు వచ్చిరి. దావీదు ఆ వార్తవిని ప్రాకారస్థలమునకు వెళ్లిపోయెను.

Book: 2 Samuel · Chapter: 5 · Verse: 17

Cross References

2 సమూయేలు 8:1

దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరచుకొని వారి వశములోనుండి మెతెగమ్మాను పట్టుకొనెను.

2 సమూయేలు 21:15

ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరల జరుగగా దావీదు తన సేవకులతోకూడ దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మ సిల్లెను.

2 సమూయేలు 23:14

దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బేత్లె హేములో ఉండిరి.

1 దినవృత్తాంతములు 11:16

దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను.

1 దినవృత్తాంతములు 14:8

దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా అభిషేకము చేయబ డెనని విని, ఫిలిష్తీయులందరు దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను.

కీర్తనలు 2:1

అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?

ప్రకటన గ్రంథము 11:15

ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలు ననెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme