Home 2 సమూయేలు 3:1 · తెలుగు బైబిల్

2 సమూయేలు

Chapter 3 · Verse 1

తెలుగు బైబిల్

2 సమూయేలు 3:1

సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను.

Book: 2 Samuel · Chapter: 3 · Verse: 1

Cross References

ఆదికాండము 3:15

మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.

2 సమూయేలు 2:17

తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.

2 సమూయేలు 3:6

సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయముచేసెను.

2 సమూయేలు 5:10

దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను.

2 సమూయేలు 22:44

నా ప్రజల కలహములలో పడకుండ నీవు నన్నువిడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు.

1 రాజులు 14:30

వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.

1 రాజులు 15:16

వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను.

1 రాజులు 15:32

వారి దినములన్నిటను ఆసా కును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగు చుండెను.

1 దినవృత్తాంతములు 3:1

దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు; కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు,

ఎస్తేరు 6:13

హామాను తనకు సంభవించినదంతయు తన భార్యయైన జెరెషుకును తన స్నేహితులకందరికిని తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులును అతని భార్యయైన జెరెషును ఎవనిచేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపువాడైనయెడల అతనిమీద నీకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడిపోదువని ఆతనితో అనిరి.

యోబు 8:7

అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.

యోబు 17:9

అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.

కీర్తనలు 45:3

శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.

కీర్తనలు 84:7

వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.

సామెతలు 4:18

పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,

దానియేలు 2:34

మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కన బడెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme