Home 2 సమూయేలు 23:9 · తెలుగు బైబిల్

2 సమూయేలు

Chapter 23 · Verse 9

తెలుగు బైబిల్

2 సమూయేలు 23:9

ఇతని తరువాతివాడు అహోహీయుడైన దోదో కుమారు డైన ఎలియాజరు, ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడివచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రా యేలీయులను తిరస్కరించి డీకొని వచ్చినప్పుడు ఇశ్రా యేలీయులు వెళ్లిపోగా ఇతడు లేచి

Book: 2 Samuel · Chapter: 23 · Verse: 9

Cross References

సంఖ్యాకాండము 23:7

అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకుతూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్నురప్పించిరమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.

1 సమూయేలు 17:10

ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను.

1 సమూయేలు 17:26

దావీదుజీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా

1 సమూయేలు 17:36

మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు,

1 సమూయేలు 17:45

దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.

1 దినవృత్తాంతములు 8:4

అబీషూవ నయమాను అహోయహు

1 దినవృత్తాంతములు 11:12

ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమ శాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు.

1 దినవృత్తాంతములు 27:4

రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

ప్రసంగి 4:12

ఒంటరి యగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?

యెషయా 63:3

ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే.

యెషయా 63:5

నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను.

మార్కు 14:50

అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme