2 సమూయేలు 15:30అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.
2 సమూయేలు 18:17జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్దగోతిలో పడవేసి పెద్దరాళ్లకుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులందరును తమ తమ యిండ్లకు పోయిరి.
నెహెమ్యా 9:27అందుచేత నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి.
కీర్తనలు 3:8రక్షణ యెహోవాదినీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా. )
కీర్తనలు 18:47ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.