2 సమూయేలు 19:27
సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా యేలినవాడవును రాజవునగు నీతో అబద్ధమాడెను. అయితే నా యేలినవాడవును రాజవునగు నీవు దేవదూత వంటివాడవు, నీ దృష్టికి ఏది యనుకూలమో దాని చేయుము.
2 సమూయేలు 19:27
సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా యేలినవాడవును రాజవునగు నీతో అబద్ధమాడెను. అయితే నా యేలినవాడవును రాజవునగు నీవు దేవదూత వంటివాడవు, నీ దృష్టికి ఏది యనుకూలమో దాని చేయుము.
నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
అందుకు ఆకీషుదైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులుఇతడు మనతోకూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు.
రాజుయెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించియున్నాడా యని అతని నడుగగా సీబాయోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవిచేసెను.
మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్లయొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్లు రెండును కుంటివి.
మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకర మగునని అనుకొంటిననెను.
సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవ దూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు.
రాజునీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను. అందుకు సీబాచిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి యిప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి యున్నాడనెను.
అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడుతన పొరుగువానిమీద నింద మోపడు
తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను
మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.