Home 2 సమూయేలు 16:12 · తెలుగు బైబిల్

2 సమూయేలు

Chapter 16 · Verse 12

తెలుగు బైబిల్

2 సమూయేలు 16:12

యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.

Book: 2 Samuel · Chapter: 16 · Verse: 12

Cross References

ఆదికాండము 29:32

లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.

నిర్గమకాండము 2:24

కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.

నిర్గమకాండము 3:7

మరియు యెహోవా యిట్లనెను - నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.

ద్వితీయోపదేశకాండము 23:5

అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిం చెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాప మును ఆశీర్వాదముగా చేసెను.

ద్వితీయోపదేశకాండము 23:6

నీ దినములన్నిట ఎన్న డును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు.

1 సమూయేలు 1:11

సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,

కీర్తనలు 10:14

నీవు దీనిని చూచి యున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావునిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు

కీర్తనలు 25:18

నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము.

కీర్తనలు 109:28

వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును.

యెషయా 27:7

అతని కొట్టినవారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతనివలన చంపబడినవారు చంపబడినట్లు అతడు చంపబడెనా?

యోవేలు 2:14

ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?

మత్తయి 5:11

నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

రోమీయులకు 8:28

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

2 కొరింథీయులకు 4:17

మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.

2 థెస్సలొనీకయులకు 1:7

దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

హెబ్రీయులకు 12:10

వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme