Home 2 సమూయేలు 15:27 · తెలుగు బైబిల్

2 సమూయేలు

Chapter 15 · Verse 27

తెలుగు బైబిల్

2 సమూయేలు 15:27

యాజకుడైన సాదోకుతో ఇట్లనెనుసాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.

Book: 2 Samuel · Chapter: 15 · Verse: 27

Cross References

1 సమూయేలు 9:9

ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శియనిపించుకొనెను. పూర్వము ఇశ్రా యేలీయులలో దేవునియొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరినయెడలమనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవు దము రండని జనులు చెప్పుకొనుట వాడుక.

2 సమూయేలు 15:34

నీవు పట్టణమునకు తిరిగి పోయిరాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు.

2 సమూయేలు 15:36

సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారు డైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చట నున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.

2 సమూయేలు 17:17

తాము పట్టణముతట్టు వచ్చిన సంగతి తెలియబడక యుండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్‌రోగేలు దగ్గర నిలిచియుండగా పని కత్తెయొకతెవచ్చి, హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి.

2 సమూయేలు 18:19

సాదోకు కుమారుడైన అహిమయస్సునేను పరుగెత్తి కొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా

2 సమూయేలు 24:11

ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1 రాజులు 1:42

యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయాలోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా

1 రాజులు 4:15

నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను.

1 దినవృత్తాంతములు 25:5

వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అను గ్రహించి యుండెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme