రూతు 2:3కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.
1 సమూయేలు 26:17సౌలు దావీదు స్వరము ఎరిగిదావీదా నాయనా, యిది నీ స్వరమేగదా అని అనగా దావీదు ఇట్లనెనునా యేలినవాడా నా రాజా, నా స్వరమే.
1 రాజులు 20:1తనయొద్ద గుఱ్ఱములను రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియారాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దానిమీద యుద్ధము చేసెను.
2 రాజులు 4:35తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.
2 రాజులు 6:12అతని సేవకులలో ఒకడురాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలురాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలురాజునకు తెలియజేయుననెను.
2 రాజులు 6:26అంతట ఇశ్రాయేలురాజు పట్టణపు ప్రాకారముమీద సంచారముచేయగా ఒక స్త్రీ రాజును చూచిరాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని
ఎస్తేరు 5:14అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను.
ఎస్తేరు 6:11ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును తీసికొని, మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుఱ్ఱము మీద అతనిని ఎక్కించి రాజ వీధిలో అతని నడిపించుచు, రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారము చేయ తగునని అతని ముందర చాటించెను.
కీర్తనలు 145:1రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను
సామెతలు 16:9ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును
ప్రసంగి 9:11మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగు చున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయ మొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.
మత్తయి 10:29రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
అపొస్తలుల కార్యములు 8:27అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకేక్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను.
రోమీయులకు 8:31ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?