2 రాజులు 8:23
యెహోరాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
2 రాజులు 8:23
యెహోరాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమును గూర్చియు, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
రెహబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదారాజులయొక్క వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
ఆసా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని బలమంతటిని గూర్చియు, అతడు చేసిన సమస్తమునుగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు యూదారాజుల వృత్తాం తముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగముపుట్టెను.
అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటకి పోవుమార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి.
అమజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
అజర్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దాని నంత టినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
యోతాము చేసిన యితర కార్యము లనుగూర్చియు, అతడు చేసినదాని నంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
ఆహాజుచేసిన యితర కార్య ములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడి యున్నది.
హిజ్కియా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని పరాక్రమమంతటిని గూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పిం చినదానిని గూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
మనష్షే చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు, అతడు చేసిన దోషమునుగూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
ఆమోను చేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది.
యోషీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించినదానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
మరియు అతడు యూదా పర్వతములయందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్థులు దేవుని విసర్జించునట్లు చేసెను. యూదావారిని విగ్రహపూజకు లోపరచెను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.