Home 2 రాజులు 5:23 · తెలుగు బైబిల్

2 రాజులు

Chapter 5 · Verse 23

తెలుగు బైబిల్

2 రాజులు 5:23

అందుకు నయమానునీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొని పోయిరి.

Book: 2 Kings · Chapter: 5 · Verse: 23

Cross References

ఆదికాండము 33:11

నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని

1 రాజులు 20:7

కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలనందరిని పిలువ నంపించిబెన్హదదునీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు; ఆ మనుష్యుడు చేయ గోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలిసికొనుడనెను.

2 రాజులు 2:17

అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడు దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను.

2 రాజులు 5:16

ఎలీషాఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసికొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతి మాలినను అతడు ఒప్పక పోయెను.

2 రాజులు 6:3

ఒకడుదయచేసి నీ దాసులమైన మాతో కూడ నీవు రావలెనని కోరగా అతడునేను వచ్చెదనని చెప్పి

2 రాజులు 12:10

పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియ జేయగా రాజుయొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి, యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి.

యెషయా 30:6

దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు.

లూకా 11:54

ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme