ఆదికాండము 31:19లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను.
లేవీయకాండము 19:31కర్ణపిశాచిగలవారి దగ్గరకుపోకూడదు, సోదె గాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.
లేవీయకాండము 20:27పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.
ద్వితీయోపదేశకాండము 18:10తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను
ద్వితీయోపదేశకాండము 18:12వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.
న్యాయాధిపతులు 17:5మీకా అను ఆ మనుష్యునికి దేవమందిర మొకటి యుండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారు లలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను.
న్యాయాధిపతులు 18:17గవినివాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మనుష్యులు లోపలచొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ ఆరువందల మంది మను ష్యులతోకూడ గవిని యెదుట వాకిట నిలిచియుండెను.
1 సమూయేలు 28:3సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములో నుండి వెళ్లగొట్టి యుండెను.
2 రాజులు 21:3తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రా యేలురాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించు చుండెను.
2 రాజులు 21:6అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, జ్యోతిషమును శకునములను వాడుక చేసి, యక్షిణిగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను
2 రాజులు 21:11యూదారాజైన మనష్షే యీ హేయమైన కార్యములను చేసి, తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను.
2 రాజులు 21:21తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు,
2 రాజులు 22:8అంతట ప్రధానయాజకుడైన హిల్కీయాయెహోవా మందిరమందు ధర్మశాస్త్రగ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథ మును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి
2 దినవృత్తాంతములు 34:14యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొని వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మ శాస్త్రముగల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కన బడెను.
యెషయా 8:19వారు మిమ్మును చూచికర్ణపిశాచిగలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించు డని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్ల దగునా?
యెషయా 19:3ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించును వారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహములయొద్దకును గొణుగువారి యొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు.