2 సమూయేలు 8:6దమస్కువశముననున్న సిరియదేశమందు దండును ఉంచగా, సిరియనులు దావీదు నకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.
1 రాజులు 11:24దావీదు సోబావారిని హతము చేసి నప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి, కూడిన యొక సైన్య మునకు అధిపతియై దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను.
1 రాజులు 14:19యరొబాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు, ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజులవృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
2 రాజులు 1:18అహజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
2 రాజులు 14:16అంతట యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్ట బడెను; అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను.
1 దినవృత్తాంతములు 18:5సోబారాజైన హదరెజెరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరి యనులలో ఇరువదిరెండు వేలమందిని హతముచేసెను.
ఆమోసు 1:5దమస్కుయొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసు లను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండ రాజ దండము వహించినవానిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.