Home 2 రాజులు 10:27 · తెలుగు బైబిల్

2 రాజులు

Chapter 10 · Verse 27

తెలుగు బైబిల్

2 రాజులు 10:27

మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది

Book: 2 Kings · Chapter: 10 · Verse: 27

Cross References

నిర్గమకాండము 34:13

కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.

లేవీయకాండము 26:30

నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.

ద్వితీయోపదేశకాండము 7:5

కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠ ములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.

ద్వితీయోపదేశకాండము 7:25

వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటి మీదనున్న వెండిబంగారములను అపేక్షిం పకూడదు. నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసికొన కూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము.

1 రాజులు 16:32

షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.

2 రాజులు 3:2

ఇతడు తన తలి దండ్రులు చేసిన ప్రకారము చేయక, తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను

2 రాజులు 11:18

అప్పుడు దేశపు జనులందరును బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతి మలను ఛిన్నాభిన్నములుచేసి, బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను.

2 రాజులు 18:4

ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభ ములను పడగొట్టి మోషేచేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండిరి

2 రాజులు 23:7

మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.

2 దినవృత్తాంతములు 34:3

తన యేలుబడి యందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై యుండగానే అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనినవాడై, పండ్రెండవయేట ఉన్నతస్థలములను దేవతాస్తంభములను పడగొట్టి, చెక్కిన విగ్రహములను పోతవిగ్రహములను తీసివేసి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రముచేయ నారంభించెను.

ఎజ్రా 6:11

ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచినయెడల వాని యింటివెన్నుగాడి ఊడ దీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింప బడును, ఆ తప్పునుబట్టి వాని యిల్లు పెంటరాశి చేయ బడును.

దానియేలు 2:5

రాజు నేను దాని మరచి పోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు తుత్తునియ లుగా చేయబడుదురు; మీ యిండ్లు పెంటకుప్పగా చేయ బడును.

దానియేలు 3:29

కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme