2 సమూయేలు 12:5దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించు కొనియెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు.
నెహెమ్యా 5:6వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని.
నెహెమ్యా 13:25అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసిమీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమా రులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి
యోబు 42:6కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.
కీర్తనలు 2:11భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి.
కీర్తనలు 35:13వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది.
కీర్తనలు 38:9ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.
కీర్తనలు 42:1దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
కీర్తనలు 69:9నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.
కీర్తనలు 119:139నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది.
కీర్తనలు 130:6కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
కీర్తనలు 145:19తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.
సామెతలు 14:16జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.
సామెతలు 28:14నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును.
పరమగీతము 8:6ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము.