Home 2 కొరింథీయులకు 10:2 · తెలుగు బైబిల్

2 కొరింథీయులకు

Chapter 10 · Verse 2

తెలుగు బైబిల్

2 కొరింథీయులకు 10:2

శరీరప్రకారము నడుచుకొనువారమని మమ్మునుగూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టి వారియెడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

Book: 2 Corinthians · Chapter: 10 · Verse: 2

Cross References

రోమీయులకు 8:1

కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.

రోమీయులకు 8:5

శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

1 కొరింథీయులకు 4:18

నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.

2 కొరింథీయులకు 11:9

మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును

2 కొరింథీయులకు 12:13

నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, మరి ఏ విషయములో మీరితర సంఘములకంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును క్షమించుడి.

2 కొరింథీయులకు 13:2

నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టు గానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను.

2 కొరింథీయులకు 13:10

కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూర ముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.

గలతీయులకు 5:16

నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.

ఎఫెసీయులకు 2:2

మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme