నిర్గమకాండము 9:16నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియ మించితిని.
నిర్గమకాండము 10:28గనుక ఫరోనా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.
ద్వితీయోపదేశకాండము 2:30అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్ల నిచ్చు టకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.
1 సమూయేలు 2:25నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.
2 దినవృత్తాంతములు 16:10ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహ ములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.
2 దినవృత్తాంతములు 18:20అప్పుడు ఒక ఆత్మవచ్చి యెహోవాయెదుట నిలువబడినేను అతని ప్రేరేపించెదనని చెప్పగా యెహోవాదేనిచేతనని అతని నడిగెను.
2 దినవృత్తాంతములు 18:25అప్పుడు ఇశ్రాయేలురాజుపట్టణపు అధిపతియైన ఆమోనునొద్దకును రాజు కుమారుడైన యోవాషునొద్దకునుమీరు మీకాయాను తీసికొని పోయి వారితో రాజు మీకిచ్చిన సెలవు ఇదియే యనుడి,
2 దినవృత్తాంతములు 24:20అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడిమీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.
2 దినవృత్తాంతములు 24:21అందుకు వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాళ్లు రువి్వ అతని చావగొట్టిరి.
సామెతలు 1:29జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను.
సామెతలు 1:30నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.
సామెతలు 9:7అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చు కొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును.
యెషయా 30:10దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పు వారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయాదర్శనములను కనుడి
యెషయా 46:10నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
యిర్మియా 2:19నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయ భక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా సెల విచ్చుచున్నాడు.
యిర్మియా 29:26వెఱ్ఱి వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రిక లను పంపితివే.