Home 2 దినవృత్తాంతములు 20:4 · తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు

Chapter 20 · Verse 4

తెలుగు బైబిల్

2 దినవృత్తాంతములు 20:4

యూదావారు యెహోవావలని సహాయ మును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.

Book: 2 Chronicles · Chapter: 20 · Verse: 4

Cross References

2 దినవృత్తాంతములు 7:14

నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.

2 దినవృత్తాంతములు 11:16

వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములయం దంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనినవారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలుల నర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి.

2 దినవృత్తాంతములు 19:5

మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదా వారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారి కీలాగున ఆజ్ఞాపించెను

ఎజ్రా 8:21

అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉప వాసముండుడని ప్రకటించితిని.

కీర్తనలు 34:5

వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.

కీర్తనలు 50:15

ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.

కీర్తనలు 56:4

దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?

కీర్తనలు 60:10

దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావు గదా?

కీర్తనలు 69:35

దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.

ఆమోసు 5:4

ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగానన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme